టీజీపీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్… ఒకేసారి ఏకంగా 3 నోటిఫికేషన్లు!

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు TGPSC శుభవార్త చెప్పింది. రోడ్లు & భవనాల (R&B) శాఖతో పాటు కాలుష్య నియంత్రణ మండలి (PCB) లో ఖాళీగా ఉన్న మొత్తం 290 ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్లు జారీ చేసింది.

ఇందులో R&B శాఖలో 222 సివిల్, 49 ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టులు ఉండగా, కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ ఉద్యోగాలు ఉన్నాయి.

వయస్సు: 18 నుండి 44 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు, ఈ ఉద్యోగాలకి అర్హులు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి).

విద్యార్హతలు & ముఖ్యమైన తేదీలు :

సివిల్ పోస్టులకు సివిల్ ఇంజినీరింగ్లో బీఈ/బీటెక్ (B.E/B.Tech).

ఈ పోస్టులకు జూన్ 6 నుండి జులై 13 వరకు అప్లై చేసుకోవచ్చు.

ఎలక్ట్రికల్ పోస్టులకు ఎలక్ట్రికల్ లేదా ఈఈఈ (EEE) విభాగంలో డిగ్రీ.

ఈ పోస్టులకు జూన్ 8 నుండి జులై 15 వరకు అప్లై చేసుకోవచ్చు.

ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టుకు సివిల్, మెకానికల్, కెమికల్, బయోటెక్నాలజీ లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్లో డిగ్రీ లేదా దానికి సమానమైన పీజీ (PG).

ఈ పోస్టులకు జూన్ 10 నుండి జులై 17 వరకు అప్లై చేసుకోవడానికి TGPSC అవకాశం కల్పించింది.

దరఖాస్తుల కొరకు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ tgpsc.gov.in ని సందర్శించండి.

అధికారిక నోటిఫికేషన్: https://t.me/govtjobpostingin

Vivek

I have been writing about government jobs for the past 5 years, helping thousands of aspirants stay updated with the latest recruitment notifications, results, and exam alerts. I am passionate about simplifying job information so that every candidate can easily understand and apply with confidence.

Related Job Posts

Leave a Comment